రన్ బీర్ కపూర్,ఇలియాన,ప్రియాంక చోప్రా
అనురాగ్ బసు సినిమా బర్ఫి
బర్ఫి, శృతి, ఝిల్మిల్ చటర్జీ – ఈ మూడు పాత్రల అందమైన చుట్టు చుట్టిన మూడు గంటల చిత్రం బర్ఫి .
బర్ఫి డెత్ బెడ్ మీద వున్నాడన్న విషయం తెలిసి కలకత్త లో వున్న శృతి (ఇలియానా) డార్జిలింగ్ కి బయల్దేరడంతో మొదలైన మన బర్ఫి కథ, ఆమె ఇహ జ్ఞాపకాల్లో లోకి ప్రయాణిస్తుంది.
ఫస్ట్ సీన్లో శృతి బర్ఫిని పట్టివ్వడం లో కథ షూరు అవుతుంది ఇక్కడె సినిమా లో ఎవరు ఎవరికి యేమిటి అన్నది అర్థం కాదు . బర్ఫీ సినిమా చేజింగ్ సీన్లో చాల వరకు రన్ బీర్ లో తాత రాజ్ కపూర్ కళలు కనపడతాయి . పోలీస్ స్టేషన్ లో బర్ఫిని ఝిల్ మిల్ యెక్కడుందో తెలిసే వరకూ వదలం మీరు వెళ్ళండి అన్నపుడు శృతి మళ్ళీ గతం లోకి వెళ్ళడం తో కథ మొదలవుతుంది. చిలిపి తనం, ఉత్సాహం, ప్రతిక్షణాన్నీ ఒక అనుభూతిగా మలుచుకునే మూగ చెవితి వాడైన బర్ఫీ మన కళ్ళముందు ప్రత్యక్షం అవుతాడు. ఆక్షణం నుండీ సినిమా చివరి వరకూ బర్ఫీ పాత్రలో ఎన్ని చమక్కులు, మెరుపులు, నిరుత్సాహపు నిర్వేదాలు, ఆశలూ నిరాశలు, ఆ పాత్రతో పాటూ అతని జీవితాన్ని ప్రేమించేస్తాం!
బర్ఫీ,శృతి తో ప్రేమలో పడతాడు ,ఆమెనే పెళ్ళి చేసుకుంటాను అని ఆమె తల్లిదండ్రులకి చెప్పడానికని వెళ్ళి, అక్కడ ఆమె ఫియాన్సీ ని చూసి తనకన్నా అతడే ఆమెకు తగిన వాడని తెలుసుకొని శృతి మీద ఆశని చంపుకుంటాడూ. ఈ లోగా ఝిల్ మిల్ చటర్జీ పాత్ర కథలో కి ఎంట్రీ ఇస్తుంది. తండ్రికి ఆపరేషన్ కి అవసరమైన డబ్బు కోసమని ఝిల్ మిల్ ని కిడ్నాప్ చేస్తాడు. ఆ టైమంలో బర్ఫి చూపే ఆప్యాయతకు ఝిల్ మిల్ కి బర్ఫి అంటే కలిగే ప్రేమని దర్శకుడు యెంతో సున్నితంగా తెరకెక్కించి చిత్రీకరించాడు. వెన్నెల నీడల్లో చెట్ల గుబురుల్లో మిణుగురు పురుగుల్ని నీటి బుడగల్లో వెలిగిస్తూ చూపించిన తీరు సూపర్.
తండ్రి చనిపోయిన దుఖం లో, ఝిల్మిల్ ని ఆమె ఆయా దగ్గర వదిలి వస్తాడు బర్ఫీ, వచ్చే టపుడు ఝిల్ మిల్ అతడిని వదల్లేక బర్ఫి వెళ్ళే బస్ వెనకాలె పరిగెత్తుకు రావడం చూసిన బర్ఫి మొఖం లోని చిరాకు, విసుగు, అసహనం – మాటలు లేకుండా ఎంతో నెచురల్గా బాడీ లాంగ్వేజిలో చూపిస్తాడు రన్ బీర్.
చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న బర్ఫీకి అనుబంధాలపై పెద్దగా నమ్మకం ఉండదు. తనకు ఆప్తులనుకున్న వాళ్ళందరికి ఒక పరీక్ష పెడుతుంటాడు , ఆ ఫరీక్షలో అతడి చెయ్యి పట్టుకుని వదలకుండా ఝిల్ మిల్ అమాయకం గా నిలుచున్న తీరు చూస్తనే అర్ధం అవుతుంది నమ్మకం అంటే ఇదే అని
దాదాపుగా మూడు సార్లు కిడ్నాప్ డ్రామా నడిచిన తర్వాత, మన కళ్ళ ఎదురుగానే ఝిల్ మిల్ వున్న కార్ నదిలో మునిగి పోతుంది. అక్కడి నుండీ ఎన్నో ట్విస్టులున్నాయి. అది చూసి ఆనందించవలసిందే! మర్డర్ మిస్టరీగా ముగించాడా అని కొంచెం భయపడ్డాను. కాని కథలోని మలుపులు అమోఘం.
శృతి (ఇలియానా) సినిమా చివరలో “ఝిల్ మిల్ (ప్రియాంకా చోప్రా) సోచ్ సమఝ్ కే ప్యార్ కియా నహీ.. ప్యార్ కర్నే కే బాద్ కుచ్ సోచా హీ నహీ” — అంటే – లాభాలూ నష్టాలూ లెక్కల బేరీజు వేసుకుని ఝిల్ మిల్ ప్రేమించలేదు, బర్ఫీని ప్రేమించాక ఇక దేన్నీ లెక్క చెయ్యలేదు – అంటుంది! అదృష్టం ప్రతి సారీ శృతిని బర్ఫీ వైపు నడిపించినా.. తల్లి మాటల ప్రకారం బర్ఫి మూగ చెవిటి అసహాయతలు తమ ప్రేమ లో నిశ్శాబ్దాన్ని సృష్టిస్తాయేమో అనే సందేహంతొ కోల్కతాలో నివసించే ధనవంతుడ్ని పెళ్ళి చేసుకుని ప్రేమ విషయం లో పేదరాలిగా మిగిలి పోతుంది. భర్తను ఎదిరించి బర్ఫీ కి అండగా నిలుద్దామనుకున్నా అప్పటికే ఝిల్ మిల్ ని మనసు నిండా నింపుకున్న బర్ఫి ప్రేమని పొందలేక ఒంటరి గా మిగులుతుంది.
పాటల విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అద్భుతమైన సాహిత్యం, అంతకన్నా అందమైన సంగీతం. ఒక్క “సావ్లీసి రాత్ హో” కొద్దిగా అనుకున్నంత బాగా చూపించలేదన్న అసంత్రుప్తి తప్ప పాటలన్నీ రసగుళికలే
ప్రేమలోని ఇలా చాలా షేడ్స్ ని ఒకటే సినిమాలో చూపించడం, ఎక్కడా ఊపిరితిప్పుకోనివ్వని స్క్రీన్ ప్లె, కథనం, ప్రియాంకా చోప్రా ముగ్ధత్వం – ఆటిస్తిక్ బాడీ లాంగ్వేజిని ఇంత అందంగా చూపించగలగడం కెమెర వర్క్ అయితే అంత అందంగా నటించిన ఘనత మాత్రం ప్రియాంకాదే. నటనలో బర్ఫిగా రన్ బీర్ తర్వాత ప్రియాంకాది రెండో స్థానం. వీళ్ళిద్దరి అనుబంధానికి మూగ సాక్షిగా శృతి అంతరంగాన్ని కళ్ళల్లో పలికించింది ఇలియానా. మొత్తంగా ఇది ఒక డైరెక్టర్ సినిమా. అనురాగ్ బసు సినిమా
0 comments:
Post a Comment